Header Banner

రోజూ కాసేపు మీకిష్ట‌మైన సంగీతం వింటే! ఏం జ‌రుగుతుందో తెలుసా?

  Sun Feb 23, 2025 08:42        Life Style

ప్ర‌స్తుతం చాలా మంది అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప‌ని విష‌యంలో క‌లిగే ఒత్తిడితోపాటు ఆర్థిక స‌మ‌స్య‌లు, కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా చాలా మంది ఆందోళ‌న చెందుతూ మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన పడుతున్నారు. ఒత్తిడి అనేది ఎంత అధికంగా ఉంటుంది అంటే.. దీని కార‌ణంగా చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటుతో మ‌ర‌ణిస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తుతం మ‌నం అనేకం చూస్తున్నాం. అందుక‌నే వైద్యులు సైతం ఒత్తిడిని త‌గ్గించుకోవాల‌ని సూచ‌న‌లు చేస్తుంటారు. అయితే ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు సంగీతం విన‌డం చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. 

 

గుండె జ‌బ్బులు రావు..
రోజూ తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌వారు కాసేపు త‌మ‌కు ఇష్ట‌మైన సంగీతం వినాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు. సంగీతం విన‌డం వ‌ల్ల శ‌రీరం యాక్టివ్‌గా మారుతుంది. మూడ్ మారి హ్యాపీగా ఉంటార‌ని చెబుత‌న్నారు. సంగీతం విన‌డం వ‌ల్ల ఒత్తిడి స్థాయిలు త‌గ్గుతాయి. మెద‌డు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం సంగీతం వినడం అనేది మెద‌డును ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా, అల‌ర్ట్‌గా ఉంచుతుంది. మెద‌డు ప‌దునుగా మారుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. సంగీతం విన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం క్ర‌మ‌బ‌ద్దంగా ఉంటుంది. దీంతో ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సంతోషంగా ఉంటారు..
మాన‌సిక ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం.. రోజూ కాసేపు ప్ర‌శాంత‌మైన సంగీతాన్ని త‌క్కువ సౌండ్‌తో విన‌డం వ‌ల్ల గుండె కొట్టుకునే వేగం త‌గ్గి ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మ‌న శ‌రీరంలో డోప‌మైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్‌. ఈ హార్మోన్ రిలీజ్ అయితే మ‌న మూడ్ మారుతుంది. ఒత్తిడి త‌గ్గి హ్యాపీ మూడ్‌లోకి వ‌చ్చేస్తాం. మ‌న‌సులో ఉండే తీవ్ర‌మైన బాధ త‌గ్గేందుకు కూడా సంగీతం ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంద‌ని అంటున్నారు. రోజూ సంగీతం వింటే మాన‌సికంగానే కాక శారీర‌కంగా కూడా ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని అంటున్నారు. 

 

డిప్రెష‌న్‌లోకి వెళ్ల‌రు..
రోజూ కాసేపు ఇష్ట‌మైన సంగీతం వింటే ఒత్తిడి క్ర‌మంగా త‌గ్గ‌డంతోపాటు డిప్రెష‌న్‌లోకి వెళ్లే అవ‌కాశాలు కూడా త‌గ్గుతాయి. సాధార‌ణంగా చాలా మందికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీన్ని నిర్వ‌హించ‌లేకపోతే దీర్ఘ‌కాలంలో అది డిప్రెషన్‌కు దారి తీస్తుంది. దీంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకునే ఆలోచ‌న‌లు పెరుగుతాయి. ఈ ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే రోజూ కాసేపు సంగీతం వినాల‌ని సూచిస్తున్నారు. మ్యూజిక్ థెర‌పీ అనేది ఎంతో ప్రభావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు. ఆందోళ‌న అధికంగా ఉన్న‌వారు కూడా సంగీతం వింటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే సంగీతం విన‌డం వ‌ల్ల ఒత్తిడి స్థాయిలు త‌గ్గి ఆయుర్దాయం కూడా పెరుగుతుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క‌నుక ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌వారు రోజూ కాసేపు త‌మ‌కు ఇష్ట‌మైన సంగీతాన్ని వింటే ఆ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LifeSTyle #Music #ListeningMusic